Ranjit మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా Lyrics

మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా
మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా
ఐ యామ్ సో సారీ బేబీ ఓ ఓ ఓ
ఐ యామ్ రియల్లీ సారీ బేబీ ఓ ఓ ఓ
ఓ చెలీ పొరపాటుకి గుణపాఠమే ఇదా ఇదా
మౌనమే ఉరితాడులా విసిరెయ్యకే ఇలా ఇలా
మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా
మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా

నా వల్ల జరిగింది తప్పు నేనేమి చెయ్యాలో చెప్పు
పగపట్టీ పామల్లే నువ్వు బుస కొట్టకే
కోపంగా కన్నెర్రచేసి కారాలు మిరియాలు నూరి
ఏవేవో శాపాలు గట్రా పెట్టెయ్యకే
కాళ్ళా వేళ్ళా పడ్డా కూడా ఊరుకోవా
కుయ్యో మొర్రో అంటూ ఉన్నా అలక మానవా
అందం చందం అన్నీ ఉన్న సత్యభామా
పంతం పట్టీ వేధించకే నన్ను ఇలా
ఓహో చెలీ చిరునవ్వులే కురిపించవా హో హో
కాదని విధిలించకే బెదిరించకే ఇలా ఒహో

మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా

అరగుండు చేయించుకుంటా బ్లేడెట్టీ కోసేసుకుంటా
కొరడాతో కొట్టించుకుంటా క్షమించవే
కాదంటే గుంజీలు తీస్తా వొంగొంగి దండాలే పెడతా
నూటొక్క టెంకాయ కొడతా దయ చూపవే
గుండెల్లోన అంతో ఇంతో జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించవా
ఫ్రెండ్ షిప్ అంటే అడపా దడపా గొడవే రాదా
సారీ అన్నా సాధిస్తావే నన్నిలా
ఓ చెలీ ఎడబాటునే కలిగించకే ఇలా ఇలా
నన్నిలా ఏకాకిలా వదిలెళ్ళకే అలా అలా

మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా

See also:

121
121.38
Si esto no es amor Wilmer Cartagena Lyrics
Sr. Zambrana Otro camino Lyrics